Akhil: 'ఆచార్య'లో నీలాంబరి పాత్ర అంటే ఎంతో ఇష్టం: పూజ హెగ్డే

Acharya movie update
  • సినిమా .. నటన అంటే నాకు ప్రాణం
  • పనిచేయడంలోనే అసలైన ఆనందం ఉంది
  • 'రాధే శ్యామ్'లో 'ప్రేరణ' పాత్ర బాగుంటుంది
  • మానసిక ఒత్తిడికి మంచి సంగీతమే మందు
టాలీవుడ్ లో ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నను ఎవరిని అడిగినా, పూజ హెగ్డే పేరే చెబుతారు. ప్రస్తుతం ఈ సుందరి వరుస అవకాశాలతో .. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.

ఇక ఆ తరువాత సినిమాలుగా 'రాధేశ్యామ్' .. 'ఆచార్య' లైన్లో ఉన్నాయి. ఈ సినిమాల గురించి పూజ హెగ్డే మాట్లాడుతూ, 'రాధే శ్యామ్'లో 'ప్రేరణ' పాత్రలో కొత్త పూజ హెగ్డేను చూస్తారు. అలాగే 'ఆచార్య'లో నేను పోషించిన 'నీలాంబరి' పాత్ర అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ పాత్రను కొరటాల గారు డిజైన్ చేసిన తీరు నాకు ఎంతగానో నచ్చింది.

సినిమా .. నటన నా ప్రాణం. అందువలన వాటికి సంబంధించిన పనిచేస్తూ ఉండటాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను .. పనిలోనే నాకు నిజమైన ఆనందం లభిస్తుంది. ఎప్పుడైనా మనసుకు ఒత్తిడి అనిపించినప్పుడు మాత్రం మంచి సంగీతం వింటాను. ఆ తరువాత మళ్లీ ఫుల్ ఎనర్జీతో నా పనిని నేను చేసుకుంటాను" అని చెప్పుకొచ్చింది.
Akhil
Pooja Hegde
Prabhas
Charan

More Telugu News