25 భాషల్లో లాంచ్ అయిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్!
- వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి వచ్చిన ఆన్ లైన్ సేవలు
- 'కె.చిరంజీవి' పేరుతో మరో వెబ్ సైట్ ఏర్పాటు
- ఈ వెబ్ సైట్ ద్వారా అందుబాటులో చిరంజీవికి సంబంధించిన సమాచారం
మరిన్ని ప్రాంతాలకు బ్లడ్, ఐబ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ వెబ్ సైట్ ను ప్రారంభించినట్టు ఈ సందర్భంగా రాంచరణ్ తెలిపారు. 25 భాషల్లో వెబ్ సైట్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలను అందించడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఇదే సందర్భంగా మరో వైబ్ సైట్ ని కూడా రాంచరణ్ ప్రారంభించారు. చిరంజీవి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, స్టార్ గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిసేలా 'కె.చిరంజీవి' పేరుతో వెబ్ సైట్ ను ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. చిరంజీవి జీవితం, ఆయన సినిమాలు, పాటలు, దర్శకనిర్మాతలతో ఆయనకున్న సత్సంబంధాలకు సంబంధించిన సమాచారం ఈ వెబ్ సైట్లో ఉంటుందని చెప్పారు.