Motkupalli: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి... ముహూర్తం ఖరారు!

Motkupalli to join TRS
  • ఈ నెల 18న టీఆర్ఎస్ లో చేరనున్న మోత్కుపల్లి
  • చాలా కాలం పాటు టీడీపీలో కొనసాగిన మోత్కుపల్లి
  • గత ఎన్నికల ముందు టీడీపీకి గుడ్ బై చెప్పిన వైనం
సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయన కారెక్కడానికి ముహూర్తం ఖరారయింది. ఎల్లుండి (18వ తేదీ) ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు టైమ్ ఫిక్సయింది. మోత్కుపల్లి సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా టీడీపీలోనే కొనసాగారు.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన టీడీపీ నుంచి బయటకు రావడమే కాకుండా, చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేశారు. తాజాగా టీఆర్ఎస్ గూటికి ఆయన చేరబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు కార్యక్రమ నిర్వహణను ఆయనకు కేసీఆర్ అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Motkupalli
TRS
KCR

More Telugu News