Huzurabad: ఈ నెల 30 వరకు హుజూరాబాద్ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

Ban on Huzurabad by poll Exit Polls
  • ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
  • ఆ రోజు సాయంత్రం ఏడున్నర గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
  • అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న ఎన్నికల అధికారి

ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజక వర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుండగా, ఆరోజు రాత్రి ఏడున్నర గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు.

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవ్వరాదని, ఇతర మాధ్యమాల్లోనూ ప్రచారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొందన్నారు. ఆదేశాలు అతిక్రమించి, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినా, మీడియాలో ప్రచురించినా శిక్ష తప్పదని కర్ణన్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News