వంట నూనె ధరలు తగ్గించే ప్రయత్నం చేయండి.. ఏపీ సహా 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖలు
- నూనెలపై విధిస్తున్న 2.5 శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా తగ్గించిన కేంద్రం
- తగ్గిన సుంకం ప్రయోజనం వినియోగదారులకు అందించాలని లేఖ
- వినియోగదారులకు కిలోకు రూ. 20 వరకు లబ్ధి చేకూరే అవకాశం
సుంకం తగ్గించడం ద్వారా కలిగే ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడం ద్వారా వారిపై ధరల భారం పడకుండా చూడాలని కోరింది. ఇలా చేయడం వల్ల కిలోపై రూ. 15-20 లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. కాగా, వంట నూనె ధరలు భగ్గుమనడంతో స్పందించిన కేంద్రం.. పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై విధిస్తున్న 2.5 శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా తగ్గించింది.