MAA: ప్రకాశ్ రాజ్ లేఖపై 'మా' ఎన్నికల అధికారి స్పందన

MAA election officer responds to Prakash Raj
  • ఎన్నికల తర్వాత కూడా అసోసియేషన్ సభ్యుల మధ్య కొనసాగుతున్న వివాదం
  • సీసీటీవీ ఫుటేజీ కావాలన్న ప్రకాశ్ రాజ్
  • ఫుటేజీ ఇస్తామన్న ఎన్నికల అధికారి
'మా' ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా అసోసియేషన్ సభ్యుల మధ్య వివాదాలు సమసిపోలేదు. ఎన్నికల సమయంలో దారుణాలు చోటుచేసుకున్నాయని... మోహన్ బాబు, నరేశ్ తమ సభ్యులను దూషించడం, బెదిరించడమే కాకుండా శారీరకంగా దాడి కూడా చేశారరని ప్రకాశ్ రాజ్ 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు లేఖ రాశారు. తమకు సీసీ కెమెరా ఫుటేజీ కావాలని కోరారు. ఈ లేఖపై ఎన్నికల అధికారి స్పందించారు. సీపీ కెమెరాల ఫుటేజీ భద్రంగానే ఉందని కృష్ణమోహన్ తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రకాశ్ రాజ్ కు ఫుటేజీని ఇస్తామని చెప్పారు.
MAA
Election Officer
Prakash Raj
CC Camera Footage

More Telugu News