Dr Sugatha Das: అమెరికా విమాన ప్రమాదంలో భారత సంతతి వైద్యుడు మృతి చెందడం దురదృష్టకరం: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy condolences to tragic death of Dr Sugatha Das
  • నిన్న అమెరికాలో విమాన ప్రమాదం
  • శాన్ డియాగో వద్ద కూలిన చిన్న విమానం
  • ఇద్దరి మృతి
  • ప్రమాద సమయంలో విమానం నడుపుతున్న డాక్టర్ దాస్
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందడం తెలిసిందే. అయితే వీరిలో ఒకరు భారత సంతతికి చెందిన ప్రఖ్యాత హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్ సుగతా దాస్ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు వెల్లడించారు.

విమాన దుర్ఘటనలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుగతా దాస్ మరణించడం దురదృష్టకరమని, ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఆయన ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని, తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి స్వస్థత చేకూర్చాలని విజయసాయి ఆకాంక్షించారు.

నిన్న ఆరిజోనాలోని యుమా నగరం నుంచి బయల్దేరిన రెండు ఇంజిన్ల సెస్నా 340 విమానం శాన్ డియాగో వద్ద ఓ హైస్కూల్ సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న డాక్టర్ సుగతా దాస్ తో పాటు, రోడ్డుపై తన వాహనాన్ని నిలిపి ఉంచిన ఓ డ్రైవర్ కూడా మరణించాడు. ప్రమాద సమయంలో డాక్టర్ సుగతా దాస్ స్వయంగా విమానం నడుపుతున్నట్టు తెలిసింది.
Dr Sugatha Das
Death
Plane Crash
USA
Vijay Sai Reddy
India

More Telugu News