Eatala Jamuna: హుజూరాబాద్ బరి నుంచి నామినేషన్ ఉపసంహరించుకున్న ఈటల రాజేందర్ అర్ధాంగి జమున

Eatala Rajendar wife Jamuna withdraws her nomination in Huzurabad by elections
  • ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక 
  • నేటితో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
  • నామినేషన్లు వెనక్కి తీసుకున్న ముగ్గురు అభ్యర్థులు
  • బరిలో 39 మంది అభ్యర్థులు
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుండగా, నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అర్ధాంగి ఈటల జమున తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి లింగారెడ్డి,  స్వతంత్ర అభ్యర్థి రాజ్ కుమార్ కూడా తమ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. మూడు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం హుజూరాబాద్ బరిలో 39 మంది అభ్యర్థులు మిగిలారు. ప్రధానంగా టీఆర్ఎస్ తరఫున గెల్లు  శ్రీనివాస్, బీజేపీ తరఫున ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి పోటీలో ఉన్నారు.
Eatala Jamuna
Nomination
Withdraw
Huzurabad
Eatala Rajendar
BJP

More Telugu News