Allu Arjun: 'పుష్ప' ఖాతాలోకి మరో సూపర్ హిట్ సాంగ్!

Pushpa lyrical video song released

  • దేవిశ్రీ ప్రసాద్ నుంచి మరో బ్యూటిఫుల్ బాణీ
  • పదప్రయోగాలతో ఆకట్టుకున్న చంద్రబోస్
  • ఆకట్టుకుంటున్న సిద్ శ్రీరామ్ ఆలాపన
  • డిసెంబర్ 17వ తేదీన విడుదల   

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. అడవి నేపథ్యంలో సాగే అవినీతితో పాటు అక్కడ చోటుచేసుకునే అందమైన ప్రేమకథగా ఈ సినిమా నడుస్తుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.    

"నిను చూస్తూ ఉంటే కన్నులు రెండూ తిప్పేస్తావే .. నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే .. కనిపించని దేవుడిని కన్నార్పక చూస్తావే .. కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే  ..చూపే బంగారమాయేనా శ్రీవల్లీ .. మాటే మాణిక్యమాయేనే .. నవ్వే నవరత్నమాయేనే' అంటూ ఈ పాట సాగుతోంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. చంద్రబోస్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన బాగున్నాయి. చంద్రబోస్ పదాలతో గారడీ చేశాడు. సిద్ శ్రీరామ్ పాడిన హిట్ పాటలలో ఒకటిగా ఈ పాట నిలుస్తుందనే అనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా హైర్ సాంగ్స్ లో ఒకటిగా ఇది చోటు సంపాదించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది..

  • Loading...

More Telugu News