డ్రగ్స్‌పై నిరాధార ఆరోపణలు, కథనాలు.. చంద్రబాబు, లోకేశ్, ఆంధ్రజ్యోతి, ఈనాడుకు ఏపీ డీజీపీ లీగల్ నోటీసులు
- ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా ఆరోపణలు చేశారని నోటీసులు
- వాస్తవాలను నిర్ధారించుకోకుండా కథనాలు ప్రచురించారన్న డీజీపీ
- బేషరతు క్షమాపణ చెప్పకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
గుజరాత్లో పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదని విజయవాడ పోలీసు కమిషనర్ స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబార్చేలా, పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేశారని ఆ నోటీసుల్లో డీజీపీ పేర్కొన్నారు. పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదని డీఆర్ఐ స్వయంగా ప్రకటించిందని గుర్తు చేశారు.
అలాగే, వాస్తవాలను నిర్ధారించుకోకుండానే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వార్తలు ప్రచురించాయని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేసినందుకు గాను నోటీసులు అందుకున్న వారందరూ బేషరతు క్షమాపణలు చెప్పాలని, ఆ వార్తను అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.