Roja: ఎమ్మెల్యే రోజా సీఎం జగన్ కు కప్పిన శాలువా ప్రత్యేకత ఏంటో చూశారా..!

YCP MLA Roja confers CM Jagan with specially made shawl
  • తిరుపతి, తిరుమలలో సీఎం జగన్ పర్యటన
  • నిన్న తిరుపతి వచ్చిన సీఎం
  • ఘనస్వాగతం పలికిన వైసీపీ నేతలు
  • ప్రత్యేకంగా రూపొందించిన శాలువాతో సీఎంకు రోజా సత్కారం
సీఎం జగన్ నిన్న, నేడు తిరుపతి, తిరుమలలో పర్యటించడం తెలిసిందే. నిన్న తిరుపతి వచ్చిన ఆయనకు వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. నగరి ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో సీఎం జగన్ ను సత్కరించారు. ప్రత్యేకంగా తయారుచేయించిన శాలువాను ఆయనకు కప్పారు. ఆ శాలువాపై అన్నీ జగన్, వైఎస్సార్ బొమ్మలే ఉండడం విశేషం. సీఎం రాకను పురస్కరించుకుని ఆ పట్టు శాలువాను రోజా దగ్గరుండి మరీ తయారుచేయించారు. సీఎం జగన్ ను సన్మానించినప్పటి ఫొటోలను రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకున్నారు. జగన్ అభిమానులను ఈ ఫొటోలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
Roja
CM Jagan
Special Shawl
Tirupati
YSRCP
Andhra Pradesh

More Telugu News