డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ అడ్మిషన్లపై ఏపీ హైకోర్టు స్టే
- ఏపీలో ఆన్ లైన్ విధానం ద్వారా డిగ్రీ అడ్మిషన్లు
- హైకోర్టును ఆశ్రయించిన రాయలసీమ కాలేజీల సంఘం
- మేనేజ్ మెంట్ కోటాను కన్వీనర్ భర్తీ చేయడంపై అభ్యంతరం
- నేడు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు
దీనిపై నేడు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ నెల 20న చేపట్టే సీట్ల కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ఆన్ లైన్ లో కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.