CM Jagan: విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్... పూర్ణకుంభ స్వాగతం పలికిన వేదపండితులు

CM Jagan arrives Vijayawada
  • తిరుపతి, తిరుమలలో ముగిసిన సీఎం పర్యటన
  • కొద్దిసేపటి కిందట విజయవాడ రాక
  • అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
  • సీఎంకు ఆశీస్సులు అందజేసిన వేదపండితులు
రెండ్రోజుల తిరుపతి, తిరుమల పర్యటన ముగించుకున్న సీఎం జగన్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. దుర్గగుడిలో ఆయనకు వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎంకు వేదపండితులు ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుండడంతో ఇంద్రకీలాద్రి కోలాహలంగా మారింది.
CM Jagan
Vijayawada
Tirumala
Tirupati

More Telugu News