Mandali Buddaprasad: తన కుమారుడి వివాహానికి రావాలంటూ పవన్ కల్యాణ్ ను ఆహ్వానించిన మండలి బుద్ద ప్రసాద్

Mandali Buddha Prasad invites Pawan Kalyan to his son marriage
  • బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహం
  • పవన్ నివాసానికి వెళ్లిన బుద్ధ ప్రసాద్
  • పెళ్లి పత్రిక అందజేత
  • పవన్ కు రెండు పుస్తకాల బహూకరణ
మాజీ మంత్రి, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ నేడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను హైదరాబాదులో కలిశారు. పవన్ నివాసానికి వెళ్లిన బుద్ధ ప్రసాద్ తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. తన కుమారుడు వెంకట్రామ్ వివాహం త్వరలో జరగనుందని, పెళ్లికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు తెలుగు భాష కథ, తెలుగు సంస్కృతి అనే పుస్తకాలను బహూకరించారు. పవన్ కల్యాణ్ పుస్తకాభిమాని అన్న సంగతి తెలిసిందే.
Mandali Buddaprasad
Pawan Kalyan
Invitation
Marriage
Venkatram

More Telugu News