Pawan Kalyan: మంచు మనోజ్ ను హృదయానికి హత్తుకున్న పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!

Pawan Kalyan friendly gesture with Manchu Manoj
  • నేడు మా ఎన్నికల పోలింగ్
  • ఓటు వేసిన పవన్ కల్యాణ్
  • పవన్ రాకతో పోలింగ్ కేంద్రం వద్ద జోష్
  • మనోజ్ తో ఆప్యాయంగా ముచ్చటించిన పవన్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటింగ్ జరుగుతుండగా, పవన్ రాకతో కోలాహలం మరింత పెరిగింది. కాగా, పవన్ రాకను గమనించిన యువ హీరో మంచు మనోజ్ ఎదురెళ్లి పలకరించారు.

మంచు మనోజ్ ను విష్ చేసిన పవన్ అతడితో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. అంతేకాదు హృదయానికి హత్తుకుని తమ మధ్య అనుబంధాన్ని చాటారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.
Pawan Kalyan
Manchu Manoj
MAA Elections
Polling
Tollywood

More Telugu News