Virat Kohli: టీ20 వరల్డ్ కప్.. ఇషాన్ కిషన్ కు విరాట్ కోహ్లీ చెప్పిన మాటిదే!

This Is The Secret Virat Kohli Told Ishan
  • ఓపెనర్ గా ఎంపికయ్యావని విరాట్ చెప్పాడన్న ఇషాన్
  • ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉండాలని సూచన
  • విరాట్ తో చాట్ చేశానన్న యంగ్ బ్యాట్స్ మన్
ఐపీఎల్ లో ఫాం అందుకోలేక ఆపసోపాలు పడిన ఇషాన్ కిషన్.. చివరి రెండు మ్యాచ్ లలో ఎంతలా చెలరేగిపోయాడో చూసే ఉంటాం. తనలోని బీస్ట్ మోడ్ ను ఒక్కసారిగా ప్రత్యర్థులకు పరిచయం చేశాడు. తానాడితే ఎలా ఉంటుందో చూపించాడు. నిన్న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. 32 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. రాజస్థాన్ తో మ్యాచ్ లోనూ 25 బంతుల్లోనే అర్ధ శతకం బాదేశాడు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో అందరి చూపూ ఈ యంగ్ ఫైర్ బ్రాండ్ పై పడింది.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇషాన్ కిషన్.. తాను వరల్డ్ కప్ కోసం సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అంతేకాదు.. ఓపెనర్ గానూ బరిలోకి దిగే అవకాశం ఉందని అతడు చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీనే స్వయంగా ఈ విషయం చెప్పాడన్నాడు.

‘‘విరాట్ భాయ్ తో చాట్ చేశాను. నువ్వు టీ20 వరల్డ్ కప్ కు ఓపెనర్ గా ఎంపికయ్యావ్.. రెడీగా ఉండమని విరాట్ భాయ్ చెప్పాడు. ఎలాంటి సవాల్ నైనా ఎదుర్కోవాలని సూచించాడు’’ అని తెలిపాడు. కాగా, ఐపీఎల్ లో బుమ్రా, హార్దిక్, క్రునాల్ పాండ్యా సహా అందరూ తనకు అండగా నిలిచారని చెప్పాడు. ఇది నేర్చుకునే దశ అని స్ఫూర్తి నింపారన్నాడు.
Virat Kohli
Ishan Kishan
Team India
T20 World Cup
Cricket

More Telugu News