గచ్చిబౌలి స్టేడియం రెండు ముక్కలు కాకుండా చూస్తాం: సీఎం కేసీఆర్
- గచ్చిబౌలి స్టేడియంపై ప్రశ్నించిన రఘునందన్
- అసెంబ్లీలో వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్
- గచ్చిబౌలి స్టేడియానికి నష్టం జరగదని హామీ
- ఇటీవల ఆందోళనకు దిగిన క్రీడాకారులు
నేడు సభలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గచ్చిబౌలి స్టేడియానికి నష్టం జరగకుండా చూడాలని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ గచ్చిబౌలి స్టేడియానికి ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. టిమ్స్ ఆసుపత్రి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని వివరించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి త్వరలోనే గచ్చిబౌలి స్టేడియాన్ని సందర్శిస్తారని తెలిపారు.