Janhvi Kapoor: తల్లిని తలచుకుని భావోద్వేగాలకు గురైన జాన్వీ కపూర్

Janhvi Kapoor gets emotional about her mother and explains her tattoo on hand
  • మూడేళ్ల కిందట మరణించిన శ్రీదేవి
  • గతంలో ఓసారి జాన్వీ గురించి రాసిన శ్రీదేవి
  • తల్లి రాసిన వాక్యాలను టాటూగా వేయించుకున్న జాన్వీ
  • ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తన తల్లి తలంపులతో భావోద్వేగాలకు లోనయ్యారు. తన చేతిపై ఉన్న 'ఐ లవ్యూ మై లబ్బూ' అనే టాటూ గురించి జాన్వీ సోషల్ మీడియాలో వివరించారు. 'లబ్బూ' అనేది తన ముద్దు పేరు అని, అమ్మ తనను "లబ్బూ" అని పిలుస్తుందని జాన్వీ వెల్లడించారు.

ఓసారి తన కోసం "ఐ లవ్యూ లబ్బూ... యూ ఆర్ ద బెస్ట్ బేబీ ఇన్ ది వరల్డ్" అని ఓ కాగితంపై శ్రీదేవి రాయగా, ఆ వాక్యాల్లోని 'ఐ లవ్యూ మై లబ్బూ' అనే పదాలను తన చేతిపై అమ్మ జ్ఞాపకార్థం టాటూగా వేయించుకున్నానని జాన్వీ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.
Janhvi Kapoor
Sridevi
Tattoo
Bollywood

More Telugu News