అమ్మవారి దర్శనం ఎంతో సంతోషాన్ని కలిగించింది: ఏపీ గవర్నర్
- ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
- నవరాత్రుల సందర్భంగా తొలి పూజ చేసిన గవర్నర్
- కరోనా నుంచి అందరికీ ఉపశమనం కలగాలని కోరుకున్నానని వ్యాఖ్య
దర్శనానంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. కరోనా నుంచి ప్రజలందరికీ ఉపశమనం కలగాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.