Junior NTR: చావుబతుకుల్లో ఉన్న అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్

Tollywood actor NTR Fulfil fan desire
  • రోడ్డు ప్రమాదంలో గాయపడిన అభిమాని మురళి
  • వైద్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్టీఆర్
  • వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం నింపిన నటుడు
  • సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలంటూ ఆకాంక్ష

అభిమానుల మనసెరగడంలో టాలీవుడ్ హీరోలు ముందుంటారు. కష్టాల్లో ఉన్నట్టు తెలిస్తే కరిగిపోతారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే స్పందించారు. చావుబతుకుల్లో ఉన్న అభిమానిని పలకరించి అతడిని అనందంలో ముంచెత్తారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన కొప్పాడి మురళి ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి మరింతగా విషమించింది.

ఈ క్రమంలో వైద్యులు అతడి కోరికలు, ఇష్టాయిష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఎన్టీఆర్‌తో మాట్లాడాలని ఉందని చెప్పాడు. దీంతో వైద్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి మురళితో మాట్లాడారు. త్వరగానే కోలుకుంటావంటూ అతడిలో ధైర్యం నింపారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తావంటూ ఆకాంక్షించారు.  

  • Loading...

More Telugu News