Prakash Raj: ప్రకాశ్ రాజ్ ను ఓడించండి: సీవీఎల్ నరసింహారావు

Beat Prakash Raj in MAA elections says CVL Narasimha Rao
  • 'మా' ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలను గెలిపించండి
  • ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో ఉన్న ఉత్తేజ్ ని గెలిపించండి
  • ప్రకాశ్ రాజ్ కి దేశమన్నా, దేవుడన్నా చులకన భావం ఉంది
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి పోటీ నుంచి సీవీఎల్ నరసింహారావు తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన మంచు విష్ణు ప్యానల్ కు మద్దతును ప్రకటించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ ప్యానల్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలను గెలిపించాలని కోరారు. విష్ణు ప్యానల్ లో ఉన్న బాబూమోహన్, ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో ఉన్న ఉత్తేజ్ ని గెలిపించాలని విన్నవించారు. దేశం అన్నా, దేవుడు అన్నా చులకన భావం ఉన్న ప్రకాశ్ రాజ్ ను ఓడించాలని అన్నారు. ప్రకాశ్ రాజ్ ఎంతసేపు ఆయన గురించే ఆలోచిస్తాడని చెప్పారు. పోటీ నుంచి ఆయన విత్ డ్రా చేసుకుంటే బెటర్ అని అన్నారు. ఈ నెల 10వ తేదీన అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
Prakash Raj
Tollywood
MAA
CVL Narasimha Rao

More Telugu News