Hema: నరేశ్, కరాటే కల్యాణిలపై ఎన్నికల అధికారికి హేమ ఫిర్యాదు

Actress Hema complaints on Naresh and Karate Kalyani
  • తనపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ 'మా' ఎన్నికల అధికారికి ఫిర్యాదు
  • తన ఫొటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • ఓటు వేయకుండా నిషేధం విధించాలని విన్నపం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. రాజకీయ నాయకులకు ఏమాత్రం తక్కువ కాని విధంగా నటీనటులు ఎదుటివారిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నరేశ్, కరాటే కల్యాణిలపై 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ఆమె లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

తనపై వీరు అసభ్య వ్యాఖ్యలు చేశారని, అసభ్య వ్యాఖ్యలతో కూడిన వీడియోను విడుదల చేశారని లేఖలో తెలిపారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.  వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, సోషల్ మీడియా లింక్ ను కూడా ఎన్నికల అధికారికి పంపారు. అక్టోబర్ 10న జరగనున్న 'మా' ఎన్నికల్లో నరేశ్, కరాటే కల్యాణిలు ఓటు వేయకుండా నిషేధం విధించాలని కోరారు.
Hema
Naresh
Karate Kalyani
Tollywood
MAA

More Telugu News