Allu Arjun: 'ఎఫ్‌3' షూటింగులో 'పుష్ప' సందడి.. ఫొటోలు ఇవిగో!

allu arjun pics go viral
  • వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో 'ఎఫ్‌3'
  • హైద‌రాబాద్‌లో షూటింగ్
  • సినీ బృందాన్ని ప‌ల‌క‌రించిన బ‌న్నీ
హీరో అల్లు అర్జున్‌, ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న‌కు విశ్రాంతి దొర‌క‌డంతో ఎఫ్‌3 మూవీ సెట్‌కు అల్లు  అర్జున్ వెళ్లాడు. ఆ సినిమా ప్రధాన పాత్రధారులు వెంక‌టేశ్‌, రాజేంద్రప్రసాద్, వ‌రుణ్ తేజ్ తో పాటు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడిని బ‌న్నీ పలకరించాడు.

ఆ సినిమా బృందంతో కాసేపు ముచ్చ‌టించాడు. వారితో అల్లు అర్జున్ దిగిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ సినిమాలో షూటింగ్‌ హైద‌రాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో త‌మ‌న్నా, మెహ‌రీన్, సునీల్, రాజేంద్ర ప్ర‌సాద్ కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎఫ్‌2 సినిమా సూప‌ర్ హిట్ అయిన నేప‌థ్యంలో దాన్ని మించిన కామెడీ స‌న్నివేశాల‌తో ఎఫ్‌3 వస్తుంద‌ని ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.  
      
Allu Arjun
Venkatesh Daggubati
f3
Tollywood

More Telugu News