Telangana: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన సీఎం కేసీఆర్

CM KCR good news to Singareni workers
  • గతేడాది కన్నా బోనస్ పెంచాలని నిర్ణయం
  • దసరాకి ముందే చెల్లించాలని సీఎండీకి ఆదేశాలు
  • కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న కేసీఆర్
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కార్మికులందరికీ బోనస్ ప్రకటిస్తూ ప్రకటన చేశారు. దసరా పండుగకు ముందే వారికి బోనస్ అందజేయాలని సింగరేణి సీఎండీకి ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. సింగరేణి కార్యకలాపాలను మరింత విస్తరించాలని ఆయన చెప్పారు.

ఇసుక, ఇనుము, సున్నపురాయి తవ్వకాల్లో విస్తరణ జరగాలని సూచించారు. బొగ్గుగని, విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్నామని కేసీఆర్ అన్నారు. సంస్థను అగ్రగామిగా నిలపడంలో కార్మికులదే గొప్ప కృషి అని మెచ్చుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం శోచనీయమని తెలిపారు.

లాభాల్లో 29 శాతాన్ని కార్మికులకు బోనస్‌గా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఇది గతేడాది ప్రకటించిన బోనస్‌ కన్నా ఒక శాతం ఎక్కువ కావడం గమనార్హం. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Telangana
KCR
TRS
Singareni Mines
Bonus

More Telugu News