గిరిజనుల కంటే కూడా దళితులే అత్యంత తక్కువ భూమి కలిగి ఉన్నారు: సీఎం కేసీఆర్
- కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- దళితబంధుపై చర్చ
- సీఎం కేసీఆర్ ప్రసంగం
- దళితుల పరిస్థితి దయనీయం అని వెల్లడి
అంబేద్కర్ చేయాల్సిందంతా చేశారని, కానీ ఇప్పటివరకు ఎవరు పాలించినా ఫలితం ఏమీలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా బీజేపీ పరిపాలిస్తున్నా దళితులు అట్టడుగునే ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ డబ్బు లభించే రైతులు దళిత రైతులేనని, రూ.15 వేల కోట్లలో వారికి పోయేది ఓ రూ.1400 కోట్లు మాత్రమేనని సీఎం కేసీఆర్ వివరించారు.
ఇవన్నీ చూసిన తర్వాతే దళితబంధు తీసుకువచ్చామని, ఇది ఒక్కరోజులో జరిగింది కాదని స్పష్టం చేశారు. దళిత్ ఎంపవర్ మెంట్ కింద రూ.1000 కోట్లు కేటాయించామని తెలిపారు.