K Kavitha: మమతా బెనర్జీ గెలిచారు కదా, మరి మోదీ రాజీనామా చేస్తారా?: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Can Modi resign asks Kavitha
  • బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు
  • సవాల్ విసరడం బీజేపీ నేతలకు అలవాటుగా మారింది
  • హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలవడం ఖాయం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కేవలం మీడియాలో కనిపించడం కోసమే ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో ఉన్నవారు ఇష్టానుసారం కాకుండా, హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఎన్నికల్లో సవాల్ విసరడం బీజేపీ నాయకులకు అలవాటుగా మారిందని చెప్పారు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసురుతున్నారని అన్నారు.

పశ్చిమబెంగాల్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ  గెలిచారని... ఆ ఎన్నికను కూడా బీజేపీ సవాల్ గా తీసుకుందని... మరి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలవడం ఖాయమని చెప్పారు.
K Kavitha
TRS
KCR
Bandi Sanjay
Narendra Modi
BJP

More Telugu News