Delhi: ఢిల్లీలో దారుణం బిజీరోడ్డుపై మహిళ గొంతు కోసిన దుర్మార్గుడు

On CCTV Man Slits Womans Throat Outside Shop In Delhi
  • మద్యం తాగి భార్యాభర్తలతో గొడవ పడిన నిందితుడు
  • యువతి బెదిరించడంతో కత్తితో దాడి
  •  పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకున్న స్థానికులు
దేశరాజధాని ఢిల్లీలో కూరగాయల బండి పెట్టుకొని జీవించే ఒక మహిళను గొంతు కోసి చంపేశాడో దుర్మార్గుడు. ద్వారకా ప్రాంతంలో ఈ ఘోరం వెలుగు చూసింది. తొలుత సదరు మహిళ వద్దకు రావడానికి నిందితుడు ప్రయత్నించాడు. దీంతో చీపురు చూపించి ఆ మహిళ అతన్ని బెదిరించింది.

దీంతో తన చేతిలోని సంచిని కింద పెట్టిన నిందితుడు దీపక్.. సంచిలో నుంచి కత్తి తీసి మహిళపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి పరారయ్యే ప్రయత్నం చేశాడు. ఈ హత్యోదంతం మొత్తం దగ్గరలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే అక్కడకు వెళ్లే సరికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలిని విభ (30)గా గుర్తించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతన్ని చావబాదారు. తాగిన మైకంలో విభ, ఆమె భర్తతో అతను గొడవ పడ్డాడని, ఆ కోపంతోనే ఇంత దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు చెబుతున్నారు.

పోలీసులకు ఈ విషయం తెలిసి వారు నిందితుడి కోసం వెళ్లగా పోలీసులను కూడా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని కాపాడిన పోలీసులు స్థానికంగా ఉన్న దీన్‌దయాళ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు విధులను అడ్డుకున్నందుకు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు.
Delhi
Woman
CCTV

More Telugu News