Rajinikanth: అన్నాత్తే షూటింగ్ లో భావోద్వేగాలకు గురైన రజనీకాంత్... కారణం ఇదే!

Rajinikanth gets emotional during Annathe song shooting
  • అన్నాత్తేలో రజనీపై పాట చిత్రీకరణ
  • అది ఎస్పీ బాలు పాడిన పాట అని వెల్లడించిన రజనీ
  • అదే చివరి పాట అవుతుందని ఊహించలేదని వివరణ
  • తన మధురస్వరంతో మనమధ్యే ఉంటారంటూ ట్వీట్
రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం అన్నాత్తే. అన్నాత్తే చిత్రంలోని ఓ పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ పాట షూటింగ్ లో రజనీకాంత్ భావోద్వేగాలకు లోనయ్యారు. ఈ పాట గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట కావడమే అందుకు కారణం! ఈ విషయాన్ని రజనీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

45 ఏళ్ల పాటు తనకు గాత్రం అందించిన బాలు పాడిన చివరి పాట షూటింగ్ లో పాల్గొన్నానని వివరించారు. ఎస్పీ బాలు గాత్రంలో అదే తనకు చివరి పాట అవుతుందని ఊహించలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. అయితే తన మధుర స్వరంతో చిరకాలం ఆయన మన మధ్యే ఉంటారని రజనీకాంత్ పేర్కొన్నారు.
Rajinikanth
SP Balu
Song
Annathe
Kollywood

More Telugu News