Shahrukh Khan: ఆర్యన్‌తోపాటు అరెస్టయిన అర్బాజ్, మున్‌మున్‌ ఎవరు?

Who are Mammut and Arbaaz who are arrested together with Aaryan
  • షారుఖ్ పిల్లలకు బెస్ట్‌ఫ్రెండ్‌ అర్బాజ్ 
  • సోషల్ మీడియాలో ముగ్గురు చేసుకున్న పార్టీల ఫొటోలు 
  • మధ్యప్రదేశ్‌కు చెందిన మోడల్‌ మున్‌మున్‌ 
  • సోదరుడితో కలిసి ఢిల్లీలో నివాసం
ముంబై డ్రగ్స్ కేసులో బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్‌ షిప్‌పై నార్కొటిక్స్ బ్యూరో అధికారులు రెయిడ్ చేశారు. ఇక్కడ ఆర్యన్‌తో పాటు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశారు. తాజాగా ఆర్యన్‌ఖాన్, అర్బాజ్‌ మర్చంట్, మున్‌మున్‌ దమేచా వేసిన బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించింది. వీరందర్నీ గురువారం వరకూ ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది.

ఈ నేపథ్యంలో ఆర్యన్‌తోపాటు అరెస్టయిన మిగతా ఇద్దరు ఎవరనే సందేహాలు చాలా మందికి కలిగాయి. షారుఖ్ ఖాన్ పిల్లలు ఆర్యన్, సుహానా ఇద్దరికీ అర్బాజ్‌ ఖాన్ మంచి ఫ్రెండ్. వీళ్లు ముగ్గురూ కలిసి చాలా పార్టీలు చేసుకున్నారు. ఆర్యన్‌, అర్బాజ్ అరెస్టయిన తర్వాత వీళ్లు ముగ్గురూ కలిసి దిగిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. బాలీవుడ్ వెటరన్ నటుడు చుంకీ పాండే కుమార్తె, హీరోయిన్ అనన్య పాండేతో కూడా అర్బాజ్ స్నేహం చేసినట్లు తెలుస్తోంది.

అలాగే మున్‌మున్‌ దమేచా ఒక మోడల్. ఈమె మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పుట్టింది. తల్లిదండ్రులిద్దరూ లేకపోవడంతో సోదరుడితో కలిసి ఢిల్లీలో నివసిస్తోంది. మోడల్‌ కావడంతో ముంబైలోనే ఎక్కువగా కాలం గడుపుతోంది. ఇన్‌స్టాలో ఆమెకు పదివేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈమె కూడా ఆర్యన్‌కు మంచి ఫ్రెండ్‌ అని వార్తలు వినిపిస్తున్నాయి.
Shahrukh Khan
Maharashtra
Bollywood

More Telugu News