Yuvraj Singh: మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి యువరాజ్ సింగ్ సాయం

Yuvraj Singh donates critical care beds and medical equipment to Mahabubnagar general hospital
  • యువరాజ్ సామాజిక సేవ
  • తన పేరిట ఫౌండేషన్ స్థాపన
  • 'యూ వుయ్ కెన్' విభాగంతో కలిసి సేవా కార్యక్రమాలు
  • మహబూబ్ నగర్ ఆసుపత్రికి బెడ్లు, ఉపకరణాలు అందజేత
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలో బిజీ అయ్యారు. గతంలో క్యాన్సర్ బాధితుడైన యువీ, ప్రధానంగా వైద్య, ఆరోగ్య రంగంలో సేవల కోసం ప్రత్యేకంగా తన పేరిట ఫౌండేషన్ స్థాపించారు. ఈ స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన విభాగమే 'యూ వుయ్ కెన్'. ఇది ప్రధానంగా క్యాన్సర్ బాధితులకు తోడ్పాటు అందిస్తుంది.

తాజాగా, యువరాజ్ సింగ్ తన యూ వుయ్ కెన్ సంస్థతో కలిసి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి భారీగా సాయం అందించారు. రూ.1 కోటి విలువైన 50 క్రిటికల్ కేర్ బెడ్లను, అత్యాధునిక వైద్య ఉపకరణాలను విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన పత్రాలను 'యూ వుయ్ కెన్' సంస్థ ప్రతినిధులు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అందించారు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ కు, 'యూ వుయ్ కెన్' సంస్థకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
Yuvraj Singh
Donation
Beds
Medical Equipment
You We Can
Mahabubnagar
General Hospital
Hyderabad

More Telugu News