'మా' ఎన్నికలతో సీఎం జగన్ కు సంబంధంలేదు: మంత్రి పేర్ని నాని
- మా ఎన్నికల్లో రాజకీయ ప్రమేయంపై వార్తలు
- ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలతో మరింత వేడి
- స్పందించిన ఏపీ మంత్రి పేర్ని నాని
- మా ఎన్నికలపై తమకు ఆసక్తి లేదని వెల్లడి
'మా' అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న ప్రకాశ్ రాజ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలోనే ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించినట్టు తెలుస్తోంది. 'మా' ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీలను లాగడం ఎందుకని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. జగన్ మీ చుట్టం అయినంత మాత్రాన ఆయనొచ్చి ఎన్నికల్లో ఓట్లేస్తారా? లేక ఓట్లు వేయిస్తారా? అని నిలదీశారు.