Aryan Khan: షారుఖ్ తనయుడితో సెల్ఫీ దిగింది ఎన్సీబీ ఆఫీసర్ కాదు: అధికారుల ప్రకటన

Man who took selfie with Aryan Khan not an NCB officer Agency as pic goes viral
  • ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌పై నార్కొటిక్స్ బ్యూరో రెయిడ్
  • షారుఖ్‌ తనయుడు ఆర్యన్ సహా 8 మందికి వైద్య పరీక్షలు
  • ఎన్సీబీ విచారణలో ఉన్న ఆర్యన్‌తో సెల్ఫీ తీసుకున్న వ్యక్తి
ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ షిప్‌పై నార్కొటిక్స్ బ్యూరో అధికారులు చేసిన రెయిడ్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్ కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే. రెయిడ్‌లో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారందరికీ ముంబైలోని జేజే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఆర్యన్‌తోపాటు అతని మిత్రులు మున్‌మున్‌ దమేచా, ఆర్బాజ్ సేత్‌ మర్చంట్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఎన్సీబీ విచారణకు ఆర్యన్ హాజరైన సమయంలో ఒక వ్యక్తి అతనితో సెల్ఫీ తీసుకున్నాడు.

ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఆ వ్యక్తి కూడా ఎన్సీబీ అధికారే అని అందరూ అనుకున్నారు. అయితే అతనికి ఎన్సీబీకి ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ‘‘అతను ఎన్సీబీ అధికారి కాదు. అలాగే ఆఫీసులో పనిచేసే వ్యక్తి కూడా కాదు’’ అని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది.
Aryan Khan
NCB
selfie

More Telugu News