Nagarjuna: నాగచైతన్య, సమంత విడిపోవడంపై నాగార్జున భావోద్వేగమైన స్పందన!

What happened between Samantha and Naga Chaitanya is unfortunate says Nagarjuna
  • సమంత, నాగచైతన్యలు విడిపోవడం దురదృష్టకరం
  • భార్యాభర్తల మధ్య జరిగింది వారి వ్యక్తిగతం
  • సమంత మాకు ఎప్పుడూ ఆప్తురాలిగానే ఉంటుంది
తామిద్దరం వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నామని సమంత, నాగచైతన్య సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. మరోవైపు ఈ అంశంపై నాగచైతన్య తండ్రి నాగార్జున స్పందించారు. 'బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెపుతున్నా. సమంత, నాగచైతన్యల మధ్య జరిగినది చాలా దురదృష్టకరం. భార్య, భర్తల మధ్య ఏం జరిగిందనేని వ్యక్తిగతం. వీళ్లిద్దరూ నాకు చాలా ఇష్టమైనవాళ్లు. సమంత మాతో గడిపిన ప్రతి క్షణం మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆమె ఎప్పుడూ మాకు ఆప్తురాలిగానే ఉంటుంది. నాగచైతన్య, సమంతలకు భగవంతుడు శక్తిని ప్రసాదిస్తాడని కోరుకుంటున్నా' అని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.
Nagarjuna
Naga Chaitanya
Samantha
Tollywood
Divorce

More Telugu News