Gellu Srinivas Yadav: హుజూరాబాద్ ఉపఎన్నిక.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్థిర, చరాస్తుల వివరాలు ఇవిగో!

Huzurabad TRS candidate Gellu Srinivas Yadav assets details
  • రూ. 20 లక్షల స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్ లో వెల్లడి
  • సొంత వాహనం లేదు
  • చేతిలో రూ. 10 వేల నగదు మాత్రమే ఉంది
హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిన్న నావినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ తొలిరోజే ఆయన నామినేషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో ఆయన తన స్థిర, చరాస్తుల వివరాలను పేర్కొన్నారు.

ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం ఆయనకు సొంత వాహనం లేదు. వీణవంకలో సొంతిల్లు, 10.25 గుంటల స్థలం ఉంది. వీటి విలువను రూ. 20 లక్షలుగా చూపించారు. బ్యాంకుల్లో రూ. 2,82,402 డిపాజిట్లు ఉన్నాయి. తన భార్య పేరిట రూ. 11,94,491 బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. భార్యకు 25 తులాల బంగారం ఉంది. తన వద్ద రూ. 10 వేలు, తన భార్య వద్ద రూ. 5 వేల నగదు మాత్రమే ఉందని తెలిపారు. ఆయన వద్ద గ్రాము బంగారం కూడా లేదు.
Gellu Srinivas Yadav
TRS
Huzurabad
Assets

More Telugu News