Uttej: ఉత్తేజ్ భార్య సంస్మరణ కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్ ప్రముఖులు

Tollywood celebs attends Uttej wife commemoration day
  • అనారోగ్యంతో కన్నుమూసిన ఉత్తేజ్ భార్య పద్మ
  • తీవ్ర విషాదంలో ఉత్తేజ్ కుటుంబం
  • నేడు పద్మ సంస్మరణ కార్యక్రమం
  • హాజరైన చిరంజీవి, శ్రీకాంత్, రాజశేఖర్ తదితరులు
టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ అర్ధాంగి పద్మ ఇటీవల కన్నుమూయగా, ఆమె సంస్మరణ కార్యక్రమాన్ని ఇవాళ హైదరాబాదులో నిర్వహించారు. ఉత్తేజ్ కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి, శ్రీకాంత్, రాజశేఖర్, సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు వంటి టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తేజ్ భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కాగా, చిరంజీవిని చూసి ఉత్తేజ్ మరోసారి తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. చిరంజీవిని హత్తుకుని భోరున విలపించారు. దాంతో చిరంజీవి.. ఉత్తేజ్ ను ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ఓదార్చారు.
Uttej
Padma
Commemoration Day
Chiranjeevi
Srikanth
Rajasekhar
Tollywood

More Telugu News