Sensex: ఏపీలో కరోనా అప్ డేట్స్.. గత 24 గంటల్లో 1,010 కొత్త కేసులు!

AP registers 1010 Corona new cases
  • చిత్తూరు జిల్లాలో 218 కేసులు
  • కర్నూలులో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు 
  • రాష్ట్రంలో 11,503 యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 58,054 శాంపిల్స్ ను పరీక్షించగా, 1,010 కొత్త కేసులు వెలుగు చూశాయి. తూర్పుగోదావరి జిల్లాలో కొత్త కేసుల సంఖ్య తగ్గగా... చిత్తూరు జిల్లాలో పెరిగాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 218 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాయలసీమలోని మరో జిల్లా అయిన కర్నూలులో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

ఇక గత 24 గంటల్లో 1,149 మంది కరోనా నుంచి కోలుకోగా... 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,50,324కి పెరిగింది. మొత్తం 20,24,645 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,176 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 11,503 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Sensex
Nifty
Stock Market

More Telugu News