Somu Veerraju: మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ ను కలిసిన సోము వీర్రాజు

Somu Veerraju met Pawan Kalyan at Janasena office
  • అక్టోబరు 30న బద్వేలు ఉప ఎన్నిక
  • ఉమ్మడి అభ్యర్థిపై జనసేన, బీజేపీ చర్చ
  • జనసేన అభ్యర్థిని బరిలో దింపే అవకాశం
  • బీజేపీ మద్దతు.. కాసేపట్లో అధికారిక ప్రకటన!
బద్వేలు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిపై త్వరలోనే స్పష్టత రానుంది. నేడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమావేశమయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వీరిరువురు బద్వేలు ఉప ఎన్నిక అంశంపై చర్చించారు.

కాగా, ఇటీవల తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని నిలిపేందుకు మద్దతు ఇచ్చిన జనసేన... ఈసారి బద్వేలు ఉప ఎన్నికలో తన అభ్యర్థిని బరిలో దింపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి బీజేపీ కూడా మద్దతు తెలిపినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, సోము వీర్రాజుతో భేటీ సందర్భంగా పవన్ కల్యాణ్ తన శ్రమదానం కార్యాచరణను కూడా వివరించారు.
Somu Veerraju
Pawan Kalyan
Budvel By Election
Candidate
Janasena
BJP
Andhra Pradesh

More Telugu News