IPL 22021: రాజస్థాన్ బౌలర్ సూపర్ ఫీల్డింగ్‌.. అభిమానుల ఫిదా

mustafizur rehman super fielding impresses fans
  • బౌండరీ లైన్ వద్ద ముస్తాఫిజుర్ రెహ్మాన్ అద్భుత ఫీల్డింగ్
  • మ్యాక్స్‌వెల్ షాట్ సిక్స్ వెళ్లకుండా ఆపేశాడు
  • నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో
ఐపీఎల్‌లో ఎంతో మంది ఆటగాళ్లు తమ సూపర్ ఫీల్డింగ్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా చేరాడు. బుధవారం నాడు రాజస్థాన్, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ బౌలర్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్న ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఆసీస్ విధ్వంసకారుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ క్రీజులో ఉన్నాడు.

కార్తీక్ త్యాగి వేసిన బంతిని లాంగ్ లెగ్ దిశగా భారీ షాట్ కొట్టాడు. కొట్టింది మ్యాక్స్‌వెల్ కావడంతో అది కచ్చితంగా సిక్స్ వెళ్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ముస్తాఫిజుర్ దాన్ని అందుకున్నాడు. సరైన సమయంలో జంప్ చేసి బంతిని ఆపేశాడు. అతని సూపర్ ఫీల్డింగ్‌తో సిక్సర్ వెళ్తుందనుకున్న బంతికి ఒక్క పరుగే వచ్చింది. ముస్తాఫిజర్ ఫీట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

అభిమానులంతా అతని కమిట్‌మెంట్‌ను మెచ్చుకుంటున్నారు. కాగా, రాజస్థాన్ జట్టుకు ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు శుభారంభం అందించినా ఆ జట్టు ఓడిపోయింది. మిడిలార్డర్ పూర్తిగా విఫలమవడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేయలేకపోయింది. 150 పరుగుల లక్ష్య ఛేదనను బెంగళూరు జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా పూర్తిచేసింంది.
IPL 22021
Rajasthan
Bengaluru
Cricket

More Telugu News