Kiren Rijiju: సంప్రదాయ నృత్యంతో అదరగొట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు... వీడియో ఇదిగో!

Union Minister Kiren Rijiju dance video goes viral
  • అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన కిరణ్ రిజిజు
  • కజలాంగ్ గ్రామంలో కేంద్ర విద్యాలయ పనుల పరిశీలన
  • ఘనస్వాగతం పలికిన స్థానిక ప్రజలు
  • సజోలాంగ్ ప్రజలతో ఆడిపాడిన కేంద్రమంత్రి
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన సొంత రాష్ట్రం అరుణాచల్ లో పర్యటించిన సందర్భంగా సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు. వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కిరణ్ రిజిజు కజలాంగ్ గ్రామానికి వచ్చారు. అక్కడి సజోలాంగ్ తెగ ప్రజలతో కలిసి ఆడిపాడారు. స్థానికులు సంగీత వాద్యాలు మోగిస్తూ జానపద గీతాలు ఆలపిస్తుండగా, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఉత్సాహంగా కాలు కదిపారు.

ఎవరైనా అతిథులు తమ గ్రామానికి వచ్చినప్పుడు సజోలాంగ్ ప్రజలు ఈ విధంగా తమ సంతోషం వ్యక్తపరుస్తారని కిరణ్ రిజిజు వెల్లడించారు. అసలుసిసలైన ఈ జానపద గీతాలు, నృత్యాలు అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రతి సామాజిక వర్గానికి గుబాళింపును అందిస్తాయని వివరించారు.
Kiren Rijiju
Dance
Traditional
Arunachal Pradesh

More Telugu News