Chiranjeevi: చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో రవితేజ?

Valter Veerraju movie update
  • విడుదలకి రెడీ అవుతున్న 'ఆచార్య'
  • సెట్స్ పైకి వెళ్లిన 'గాడ్ ఫాదర్'
  • గ్రౌండ్ వర్క్ లో 'భోళా శంకర్'
  • 'వాల్తేర్ వీర్రాజు' కోసం సన్నాహాలు
చిరంజీవి వరుస సినిమాలను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ 'ఆచార్య' సినిమాను పూర్తి చేసిన ఆయన, ఆ తరువాత మూడు భారీ సినిమాలు లైన్లో పెట్టేశారు. మోహన్ రాజాతో 'గాడ్ ఫాదర్' సెట్స్ పైకి వెళ్లగా, ఒక సినిమాకి మెహర్ రమేశ్ .. మరో సినిమాకి బాబీ దర్శకత్వం వహించనున్నారు.

మెహర్ రమేశ్ 'బోళా శంకర్' అనే టైటిల్ ను ఖరారు చేయగా, బాబీ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి 'వాల్తేర్ వీర్రాజు' టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం రవితేజను సంప్రదిస్తున్నారనేది తాజా సమాచారం.

ఈ పాత్రకి  రవితేజ అయితేనే సరైన న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయనను గట్టిగానే రిక్వెస్ట్ చేస్తున్నారట. చిరంజీవితో రవితేజకు మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో ఆయన సినిమాలైన 'అన్నయ్య' .. 'శంకర్ దాదా జిందాబాద్'  సినిమాల్లో కనిపించాడు. ఆయనని అడుగుతుండటం నిజమే అయితే, ఒప్పుకునే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Chiranjeevi
Raviteja
KS Ravindra

More Telugu News