YS Sharmila: వైయస్ షర్మిలతో ప్రశాంత్ కిశోర్ టీమ్ భేటీ

YS Sharmila joins hands with Prashant Kishor
  • లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశం
  • పార్టీ విస్తరణ, పాదయాత్ర తదితర అంశాలపై చర్చ
  • పీకే టీమ్ సేవలు తీసుకోనున్నట్టు ఇటీవలే వెల్లడించిన షర్మిల
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైయస్సార్టీపీతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్ జతకట్టింది. లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైయస్ షర్మిలతో ప్రశాంత్ కిశోర్ టీమ్ భేటీ అయింది. ఈ భేటీలో పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, పాదయాత్ర తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

ప్రశాంత్ కిశోర్ టీమ్ సేవలు తీసుకోనున్నట్టు ఇటీవలే షర్మిల ఓ టీవీ కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఆమె చెప్పిన రోజుల వ్యవధిలోనే పీకే టీమ్ రంగంలోకి దిగింది. రాబోయే ఎన్నికల సమయానికల్లా పార్టీని ఇతర ప్రధాన పార్టీలకు దీటుగా తయారు చేయడమే లక్ష్యంగా పీకే టీమ్ పని చేయనుంది. పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలన్నింటినీ నిర్వహించనుంది. వీరి సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
YS Sharmila
YSRTP
Prashant Kishor
Telangana

More Telugu News