Gorantla Butchaiah Chowdary: ఏమి పాలన? ఏమి రాజకీయం?: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఎద్దేవా

gorantla fires on jagan
  • జగన్ రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది
  • ఒక్క చాన్స్ ఇవ్వండి అని వచ్చారు
  • డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు
  • ప్రజలకి ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ సీఎం కాక‌ముందే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌శాంతంగా ఉండేద‌ని ఆయ‌న చెప్పారు. వ‌చ్చాక ప‌రిస్థితుల‌న్నీ త‌ల‌కిందుల‌వుతున్నాయ‌ని ఆరోపించారు.

'జగన్... అనే వ్యక్తి రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది. ఒక్క చాన్స్ ఇవ్వండి అని వచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. ప్రజలకి ప్రెసిడెంట్ మెడల్ (మ‌ద్యం సీసాల బ్రాండు) ఇచ్చారు, అతను చేస్తున్న అసమ్మతి, అసమర్థ, పాలనని పక్క దోవ పట్టించడానికి కులాల కుంపట్లు, మతాల కుమ్ములాటలు, ప్రాంతాల మధ్య చిచ్చు రేపడాలు జ‌రుగుతున్నాయి. ఏమి పాలన? ఏమి రాజకీయం? ప్రశాంతమైన ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది' అని ట్విట్ట‌ర్‌లో గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి విమ‌ర్శ‌లు గుప్పించారు.

  • Loading...

More Telugu News