Allu Arjun: ‘ఎంతో ప్రత్యేకమైన వ్యక్తికి’ అంటూ అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ పోస్ట్.. లక్షల్లో వ్యూస్!

Allu Arjun Special Birth Day Wishes For His Love Of Life
  • ఇవాళ తన భార్య స్నేహ పుట్టిన రోజు
  • ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టిన స్టైలిష్ స్టార్
  • ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్ష
టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో ఒకరు అల్లు అర్జున్, స్నేహ. 2014 మార్చి 6న వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి అయాన్, అర్హ సంతానం. ఇవాళ స్నేహ పుట్టిన రోజు సందర్భంగా ‘ప్రత్యేక’ శుభాకాంక్షలు చెప్పాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

‘‘నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడూ ఎంతో ఆహ్లాదంగా ఉండే నీలాంటి వ్యక్తి నా భార్యగా నా జీవితంలోకి వచ్చినందుకు నేనెంతో అదృష్టవంతుడిని. హ్యాపీ బర్త్ డే.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి’’ అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు.

పోస్ట్ కు గతంలో తాజ్ మహల్ సందర్శన సందర్భంగా తీసిన ఫొటోను జత చేశాడు. పోస్ట్ పెట్టిన 11 గంటల్లోనే 10.85 లక్షల మంది చూశారు. కాగా, ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఇవాళే హీరోయిన్ రష్మిక పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయడం విశేషం.
Allu Arjun
Sneha
Tollywood
Birth Day
Instagram

More Telugu News