తెలంగాణలో పెరిగిన సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీల వేతనాలు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- సర్పంచుల వేతనం రూ.6,500కు, జడ్పీటీసీ, ఎంపీపీల వేతనం రూ. 13 వేలకు పెరుగుదల
- ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్న మంత్రులు
జూన్ నుంచే ఈ పెంపు అమల్లోకి వచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గౌరవ వేతనాల పెంపుపై మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు స్పందించారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. వేతనాల పెంపుపై సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీపీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.