Kanhaiya Kumar: రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కన్నయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ

Kanhaiya Kumar and Gignesh Mewani joins Congress party
  • కాంగ్రెస్ లోకి యువనేతలు
  • హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్న కన్నయ్య, జిగ్నేశ్
  • ఢిల్లీలో కార్యక్రమం
  • పార్టీలోకి సాదరస్వాగతం పలికిన రాహుల్
దేశరాజకీయాల్లో కొద్దికాలంలోనే గుర్తింపు పొందిన యువనేతలు కన్నయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కన్నయ్య కుమార్ సీపీఐకి, జిగ్నేశ్ మేవానీ రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కు గుడ్ బై చెప్పేశారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కన్నయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

కన్నయ్య కుమార్ బీహార్ కు చెందిన నేత. విద్యార్థి సంఘం నాయకుడిగా అనేక పోరాటాల్లో పాల్గొన్న కన్నయ్య బీహార్ లోని బెగుసరాయి ప్రాంతానికి చెందిన వ్యక్తి. గత ఎన్నికల సమయంలో సీపీఐలో చేరిన కన్నయ్య కుమార్... బెగుసరాయి నుంచి లోక్ సభకు పోటీ చేసి బీజేపీకి చెందిన గిరిరాజ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇక, జిగ్నేశ్ మేవానీ జాతీయస్థాయిలో దళితనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. గుజరాత్ లోని వడ్ గాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కు కన్వీనర్ గా వ్యవహరించారు.
Kanhaiya Kumar
Gignesh Mewani
Congress
Rahul Gandhi
New Delhi

More Telugu News