Raghu Rama Krishna Raju: పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకు?... పేర్ని నాని వ్యాఖ్యలపై రఘురామ స్పందన

Raghurama Krishna Raju responds on Perni Nani remarks over Pawan Kalyan
  • పవన్ వర్సెస్ ఏపీ మంత్రులు
  • పవన్, పేర్ని నాని మాటల యుద్ధం
  • ట్విట్టర్ లో పరస్పర వాగ్బాణాలు
  • పేర్ని నాని వ్యాఖ్యలు నీచాతినీచమన్న రఘురామ
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో సున్నితమైనదని, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ పై ఓ మంత్రి అనవసరంగా కొన్ని మాటలు మాట్లాడారని, ఆయన అనవసరంగా కుల ప్రస్తావన తీసుకువచ్చారని విమర్శించారు. కుక్కలు, గ్రామ సింహాలు, వరాహాలు అంటూ కామెంట్లు చేసుకోవడం సరికాదని హితవు పలికారు. కానీ పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వైవాహిక సంస్కారాలు అనే వ్యాఖ్య చేయడం నీచాతినీచమైన సంస్కృతి అని అన్నారు.

గతంలో పవనే దీని గురించి చెప్పారని, కొందరికి అదృష్టం ఉంటుందని, కొందరికి అదృష్టం ఉండదని, మనసులు కలవక విడిపోవడం సహజమేనని రఘురామ పేర్కొన్నారు. ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకేమైంది?... ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ద్వారా మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని తెలిపారు. ఎదుటి వ్యక్తి వైవాహిక జీవితం గురించి ఎత్తిచూపేటప్పుడు ఒక వేలు చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయని, ఈ విషయాన్ని పేర్ని నాని, పోసాని వంటి వాళ్లు తెలుసుకోవాలని హితవు పలికారు.

విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది? ఇక్కడ ఎవడు పత్తిత్తు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నాన్సెన్స్ నిలిపివేయాలని పేర్ని నానికి విజ్ఞప్తి చేస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు.  సినీ రంగ వివాదం పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రం నుంచే ప్రారంభమైందన్నది వాస్తవం అని స్పష్టం చేశారు. ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ను చక్కదిద్దుకోకుండా, సినిమా రంగం తరఫున టికెట్లు అమ్మడం కోసం పోర్టల్ ఏర్పాటు చేయడం అవసరమా? అని రఘురామ ప్రశ్నించారు. ఇప్పటికే కోర్టు కేసుల్లో న్యాయవాదులకు కోట్లు చెల్లిస్తున్నారని, ఇప్పుడీ దుబారాలు ఎందుకని నిలదీశారు.
Raghu Rama Krishna Raju
Perni Nani
Pawan Kalyan
Comments

More Telugu News