Pawan Kalyan: 'ఇక‌ సమయం ఆసన్నమయింది' అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌

pawan slams ycp
  • వైసీపీ ప్రభుత్వానిది 'పాలసీ ఉగ్రవాదం'  
  • అన్ని రంగాలు, అన్ని వర్గాలు నాశనం
  • దీనిని ఎదుర్కోవాల్సి ఉంది
వ‌రుస‌గా సినిమాల షూటింగుల్లో బిజీగా గ‌డుపుతోన్న జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ పూర్తి స్థాయిలో రాజ‌కీయాల‌పై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడ‌తాన‌ని ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. సాయితేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏపీ స‌ర్కారుపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అనంత‌రం కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఏపీ స‌ర్కారుపై ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఏపీ మంత్రులు త‌న‌పై విరుచుకుప‌డుతున్న నేప‌థ్యంలో ఆయ‌న తాజాగా మ‌రో ట్వీట్ చేశారు.

"వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం'కి అన్ని రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయింది'' అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. తాను ఇక రాజ‌కీయాల‌పైనే దృష్టి పెడ‌తాన‌న్న సంకేతాలు ఇచ్చారు.
Pawan Kalyan
Janasena
YSRCP

More Telugu News