IPL 2021: డివిలియర్స్ అవుటైతే అతని కుమారుడి రియాక్షన్ చూడండి.. తల్లే షాకైపోయింది!

Devilliers son reacts to his father out in MI match
  • ముంబై మ్యాచ్‌లో అభిమానులను నిరాశపరిచిన ఏబీడీ
  • 6 బంతుల్లో కేవలం 11 పరుగులు చేసి అవుట్
  • బుమ్రా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన డివిలియర్స్
ఐపీఎల్‌ స్టార్ ప్లేయర్లలో ఏబీ డివిలియర్స్ ఒకడు. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్లేయర్ ఇటీవల పెద్దగా రాణించడం లేదు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఏబీడీ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో 6 బంతులెదుర్కున్న డివిలియర్స్ 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

ఆ వికెట్ పడిన సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. బెంగళూరు జట్టు బ్యాటింగ్ సమయంలో 19వ ఓవర్ జరుగుతోంది. జస్ప్రీత్ బుమ్రా బంతి తీసుకున్నాడు. భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అందరూ ఆశిస్తున్న ఏబీడీ క్రీజులో ఉన్నాడు. అయితే బుమ్రా బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు ఏబీడీ. అతని బ్యాటును తాకిన బంతిని కీపర్ డీకాక్ ఒడిసిపట్టేశాడు. దీంతో నిరాశగా ఏబీడీ పెవిలియన్ చేరాడు.

ఆ సమయంలో మ్యాచ్ చూడటానికి ఏబీడీ కుటుంబం కూడా వచ్చింది. ఆ సమయంలో మ్యాచ్ చూస్తున్న ఏబీడీ భార్య, కుమారుడు కూడా అతను అవుట్ అవడంతో నిరాశచెందారు. ముఖ్యంగా అతని కుమారుడు కోపంతో ఎదురుగా ఉన్న కుర్చీని బలంగా కొట్టాడు. తండ్రి అవుట్ అవడంతో చిరాగ్గా కేకలేశాడు. ఇదంతా చూసిన ఏబీడీ భార్య చాలా ఆశ్చర్యపోయింది. కుమారుడిని ఆపడానికి ప్రయత్నించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
IPL 2021
Royal Challengers Bengalore
AB DeVilliers
Viral Videos

More Telugu News