'గులాబ్' తుపాను మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం విషయమై జగన్ కీలక ఆదేశాలు
- గులాబ్ తుపాను కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- తుపాను బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష
- మృతుల కుటుంబాలకు తక్షణమే రూ. 5 లక్షల సాయం అందించాలని సీఎం ఆదేశం
వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే... విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో పునరుద్ధరించే ప్రయత్నం చేయాలని జగన్ చెప్పారు. తుపాను కారణంగా మృతి చెందిన కుటుంబాలకు తక్షణమే రూ. 5 లక్షల సాయాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు.