Narendra Modi: దంత సమస్యల కారణంగా ఇష్టమైన పదార్థాలను తినలేకపోతున్నాం: మోదీకి ఇద్ద‌రు చిన్నారుల లేఖ

child writes letter to modi
  • అసోంకు చెందిన అక్కాత‌మ్ముళ్ల లేఖ‌
  • ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వారి మేన‌మామ‌
  • దంత స‌మ‌స్య‌లు పరిష్కరించాల‌ని విన‌తి
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ,  అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాకు ఇద్ద‌రు చిన్నారులు రాసిన లేఖ వైర‌ల్ అవుతోంది. అసోంకు చెందిన‌ రవ్జా (6), ఆమె తమ్ముడు ఆర్యన్ (5) విడివిడిగా లేఖలు రాశారు. త‌మ‌కు  దంత సమస్యలు ఉన్నాయ‌ని,  దంతాలు ఊడిపోయాక, అవి తిరిగి వచ్చేందుకు చాలా సమయం పడుతోంద‌ని వారు వాపోయారు.  

ఆహారం తినేందుకు ఇబ్బందిగా ఉందని, ఇష్ట‌మైన ఆహార ప‌దార్థాలు తిన‌లేక‌పోతున్నామ‌ని చెప్పారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను దేశంలోని ప్రముఖ నేతలకు చెప్పాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అన్నారు. ఆ చిన్నారులు దంతాల‌కు సంబంధించిన బొమ్మ‌ను కూడా గీయ‌డం గ‌మ‌నార్హం.   వారి లేఖను వారి మేన‌మామ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేయ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వారి దంత సమస్యలను పరిష్కరించాల‌ని నెటిజ‌న్లు కూడా కోరుతున్నారు.
               
Narendra Modi
BJP
India
assam

More Telugu News